అనుష్క,రానా ల సినిమా ?

Anushka, Rana, bahubali, bahubali2, Rudramadevi, peoples media, kona film,

అనుష్క, రానా మరోసారి ఒకే తెరపై కి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి సినిమాలు చూసారు . సైజ్‌జీరోలోనూ రానా అతిథి పాత్ర . అనుష్క కొత్త సినిమా సైలెంట్‌ లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలు రావాల్సి ఉంది.

హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం . అమెరికాలో ఈ చిత్రం షూటింగ్‌ కాబోతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు ,షాలినీ పాండే తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.

రానా హాథీ మేరే సాథీ సినిమా లో ను నటిస్తున్నారు. మరోపక్క ఆయన కీలక పాత్రలో హౌస్‌ఫుల్‌ 4 సినిమా కూడా రిలీజ్ కు ఉంది . చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించిన యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు చిత్రం ఫిబ్రవరి 22న విడుదలకు సిద్ధమైంది.