అక్కడ కూడా హిట్ కొట్టిన అనుపమ

anupama-parameswaran
anupama-parameswaran

మలయాళంలో అంతకుముందు ఉన్న రికార్డ్స్ అన్నీ తిరగరాస్తూ సంచలన విజయం సాధించిన సినిమా ప్రేమమ్.ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కి ఆ తరువాత మాత్రం ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చాయి.తెలుగులో అ…ఆ సినిమాలో నటించి రెండో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అనుపమ ప్రేమమ్ తెలుగు రీమేక్ తో హ్యాట్రిక్ అందుకుంది.దీంతో ఆమె టాలీవుడ్ లక్కీ చార్మ్ అని ప్రచారం సాగింది.

తెలుగుతో పాటు తమిళ్ లో కూడా కొడి అనే సినిమా చేసి అక్కడ కూడా హిట్ అందుకుంది. ఆమె నటించిన శతమానం భవతి సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడంతో ఆమె డేట్స్ డైరీ ఫుల్ అయిపొయింది.కానీ ఆ తరువాత తెలుగులో ఆమె చేసిన మూడు సినిమాలు వరుసగా పరాజయం పాలయినా హలో గురు ప్రేమ కోసమే సినిమాతో ట్రాక్ లోకి వచ్చింది.అయితే రీసెంట్ గా ఆమె కన్నడ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.డెబ్యూ సినిమానే పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరో తో చేసింది.

అయితే అనుపమ నటించిన కన్నడ సినిమా నటనాసార్వభౌమ టాక్ పరంగా కాస్త వీక్ అయినా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తుంది.ఈ సినిమా కమర్షియల్ హిట్ తో అక్కడి హీరోలకు కొత్త హీరోయిన్ ఆప్షన్ గా కనిపిస్తుంది అనుపమ.అక్కడే మరిన్ని సినిమాలకు సైన్ చేసే అవకాశం కూడా ఉంది.

మాలీవుడ్ లో మొదలయిన అనుపమ ప్రయాణం టాలీవుడ్ వయా కోలీవుడ్ అంటూ శాండల్ వుడ్ దాకా సాగింది.దీంతో సౌత్ లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో నటించడమే కాకుండా హిట్స్ కూడా అందుకున్న హీరోయిన్ గా అరుదయిన రికార్డ్ అందుకుంది.ఈ మలయాళీ బ్యూటీ ముందు ముందు ఇంకెన్ని హిట్స్ అందుకుంటుందో,ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.