అంతరిక్షం 9000 KMPH

Anthariksham 9000 KMPH
Anthariksham 9000 KMPH

వరుణ్ తేజ్(దేవ్),సినిమా ప్రారంభంలోనే అంతరిక్షం సీన్లు చూపించి ప్రేక్షకులను ఆసక్తికర పరిస్థితుల్లోకి సంకల్ప్ తీసుకెళ్ళిపోతారు.అయితే అదే ఉత్సుకతను సంకల్ప్ ఫస్టాఫ్ ముగిసేంతవరకు తీసుకెళ్లడంలో మాత్రం చాలా వరకు విఫలమయ్యారనే చెప్పాలి.ఎందుకంటే మొదటి సగభాగంలో చాలా వరకు సినిమాకి సంబందించిన పాత్రలకే ఎక్కువ సమయం కేటాయించడంతో ఆరంభంలో ప్రేక్షకుడికి నెలకొన్న ఉత్సుకత క్రమక్రమంగా లోపిస్తుంది.దీని వలన ఫస్టాఫ్ లోనే ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు.దానితో ఎదో పరవాలేదు అనే స్థాయిలో ఫస్టాఫ్ ను ముగించేస్తారు.కానీ సెకండాఫ్ నుంచి మాత్రం అసలైన స్టోరీ మొదలవుతుందని కూడా పరోక్షంగానే చెప్తారు.

ఇక రెండో సగభాగానికి వచ్చినట్టయితే అంతే కాకుండా ఘాజీ వంటి అద్భుత చిత్రం తర్వాత ఇచ్చిన సంకల్ప్ రెండో చిత్రం అందులోను అంతరిక్ష కథా నేపథ్యంలో మొదటి సినిమాను ఎంచుకోవడంలోనే సంకల్ప్ మార్కులు కొట్టేసారు.కానీ దాన్ని అనుకున్నంతగా తీర్చిదిద్దడంలో మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయి.రెండో సగభాగం మళ్ళీ మొదలుతోనే అంతరిక్షంలో మొదలవుతుంది.ఇంకా చెప్పాలి అంటే ఫస్టాప్ కంటే సెకండాఫ్ నే దర్శకుడు కాస్త ఆసక్తికరం గా మలిచారు.అంతే కాకుండా హీరోకి ఎదురయ్యే కొన్ని ఛాలెంజింగ్ సన్నివేశాలు,స్పేస్ లో కనిపించే సీన్స్ అయితే ఈ చిత్రానికే హైలైట్ అని చెప్పొచ్చు.

నటుడు శ్రీనివాస్ అవసరాల కూడా వరుణ్ కి సపోర్టింగ్ పాత్రలో బాగానే చేసారు.ఇంకా వరుణ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ లో అతని గర్ల్ ఫ్రెండ్ గా కనిపించిన లావణ్య త్రిపాఠీ కూడా పర్వాలేదనిపించారు.అలాగే ప్రశాంత్ ఆర్ విహారి పాటల విషయంలోనూ బాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలోను ఒకే అనిపించారు.అలాగే దర్శకుడు సెకండాఫ్ లో పెట్టిన శ్రద్ధ ఫస్టాఫ్ లో కూడా తీసుకొని ఉంటే ప్రేక్షకులని ఆరంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొల్పే వారయ్యేవారు.కానీ ఆ ఒక్క విషయంలో సంకల్ప్జాగ్రత్త వహించి ఉంటే ఇంకా బాగున్ను.

ఇక చివరిగా చెప్పాలి అంటే అతి తక్కువ బడ్జెట్ తోనే అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్న సినిమాలను తియ్యొచ్చని “ఘాజీ” లాంటి చిత్రం తీసి సంకల్ప్ నిరూపించారు.ఇప్పుడు కూడా అలాగే ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు తీసుకొని సబ్జెక్టు ను ఎంచుకొని మరో ప్రయోగాన్ని చేపట్టారు.కానీ ఈ ప్రయోగం మాత్రం అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి.సెకండాఫ్ లో తీసుకున్న శ్రద్ధ ఫస్టాఫ్ లో కూడా దర్శకుడు తీసుకొని ఉంటే సినిమా ఇంకో స్థాయిలో ఉండేది.అంతే కాకుండా ఇంత తక్కువ బడ్జెట్ లో అంతరిక్షం లో నే తీసారా అన్నట్టుగా చిత్రీకరించిన వీరి టీం ని మాత్రం మెచ్చుకొనే తీరాలి.మొత్తంగా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ గా నిలవొచ్చు.