వైఎస్సార్‌సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ

YSRCP, MP, Congress, Ravindrababu, Chandrababu, naidu,

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఎంపీ పి. రవీంద్రబాబు అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని అమలాపురం రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో చేరారు అని అన్నారు . పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

 

ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు చేయలేదని , ఆయన వల్లే ప్రత్యేక హోదా రాలేదని అని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో వల్లే చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పనికిరారని , వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. ఒకే సామాజిక వర్గానికి మాత్రమే మేలు జరుగుతోందని వెల్లడించారు.