మెగా కాంపౌండ్ లోకి మరో హీరోయిన్…!

AlluArjun,RamCharan

మెగా కాంపౌండ్ హీరోల్లో ఒక ఆనవాయితీ ఉంది.ఎవరయినా ఒక హీరోయిన్ మెగా కాంపౌండ్ హీరోస్ ఎవరితో అయిన జతకట్టిదంటే చాలు ఆ కాంపౌండ్ లో మిగతా హీరోలు కూడా ఆటోమాటిక్ గా ఆమెకి లిఫ్ట్ ఇస్తారు.ఇది ఇప్పటికి ఒకసారి జరిగిందో లేక ఒక్కరి విషయంలో జరిగిందో కాదు.శృతి హాసన్,కాజల్,తమన్నా,పూజా హెగ్డే,రకుల్ ప్రీత్,అను ఇమ్మానుయేల్,అమలా పాల్…ఇలా ఈ లిస్ట్ చాలా పొడవు ఉంటుంది.

కాజల్ ఆల్రెడీ చిరు తో కూడా చిందులేస్తే తమన్నా ఇప్పడు సైరా లో జాయిన్ అయ్యింది.భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వానీ కొత్తగా ఈ లిస్ట్ లో ఎంటర్ అయ్యింది.రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేస్తుంది కియారా.ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే మెగా కాంపౌండ్ నుండి మరో భారీ ఆఫర్ ఆమెని వరించింది.

అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కియారా ని హీరోయిన్ గా ఫిక్స్ చేస్తున్నారు.పెద్ద ఆఫర్ కాబట్టి ఆమె కూడా ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.మొత్తానికి మెగా కాంపౌండ్ సెంటిమెంట్ ని రిపీట్ చేసే పనిలో బిజీ గా ఉంది కియారా అద్వానీ.ఈ రెండు సినిమాలతోనే ఆగుతుందా లేక మరిన్ని మెగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందా అనేది వేచి చూడాలి.