మోదీ స‌ర్కార్‌కు మ‌రో దెబ్బ

PM Narendra Modi
PM Narendra Modi

మోదీ స‌ర్కార్‌కు ఇదో పెద్ద దెబ్బ‌. కేంద్ర నిర్ణ‌యాన్ని సుప్రీం త‌ప్పుప‌ట్టింది.సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ చీఫ్‌గా అలోక్ వ‌ర్మను తిరిగి నియ‌మిస్తూ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఇటీవ‌ల సీబీఐ చీఫ్ అలోక్ వ‌ర్మ‌, స్పెష‌ల్ డైర‌క్ట‌ర్ రాకేశ్ ఆస్థానా మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో.. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర్మ‌ను లీవ్‌పై పంపింది. దాన్ని స‌వాల్ చేస్తూ అలోక్ వ‌ర్మ .. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గంగోయ్ సెలవు తీసుకోవ‌డంతో.. ఆ తీర్పును జ‌స్టిస్ సంజ‌య్ కిషన్ కౌల్ వినిపించారు . కోర్టు నెంబ‌ర్ 12లో తీర్పును వెలువ‌రించారు. అయితే అలోక్ వ‌ర్మ కీల‌క నిర్ణ‌యాలు ఏవీ తీసుకోకూడ‌ద‌ని కోర్టు త‌న తీర్పులో స్ప‌ష్టంగా పేర్కొంది. సీబీఐ చీఫ్‌ను నియ‌మించే ప్యాన‌ల్ మాత్రం అత‌నిపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుప్రీం తెలిపింది.