మ‌ళ్లీ దీక్ష‌కు దిగుతోన్న అన్నా హ‌జారే

Anna Hazare
Anna Hazare

ప్రముఖ సామాజిక వేత్త అన్నాహజారే ఆమరణ నిరాహార దీక్ష షురూ కానుంది. ఇప్పటికే పలుసార్లు లోక్ పాల్ కోసం దీక్షకు దిగిన అన్నాహజారే, ఇప్పుడు లోక్ పాల్ ఏర్పాటు, రైతుల డిమాండ్లను పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఈనెల 30 న తన సొంత గ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్షకు కూర్చుంటానని హజారే న్యూఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్ల‌డించారు .

లోక్ పాల్ చట్టంపై సుప్రీంకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా లోకాయుక్త చట్టం 2013ని అమలు చేయడం లేదని కేంద్రస‌ర్కారు పై ఆయ‌న నిప్పులు చెరిగారు. ఇది ప్రభుత్వమా పచారీనా అనేది అర్ధం కావడం లేదన్నారు. మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలకు పోతోందని ధ్వ‌జం ఎత్తారు. తనకు ప్రభుత్వం ఇచ్చే అబద్ధపు వాగ్దానాలపై ఇక నమ్మకం లేదని, తుది శ్వాస వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని అన్నా హ‌జారే ప్రకటించారు.