పోలింగ్ డే ని హిస్టారికల్ డే గా అభివర్ణించిన చంద్రబాబు

Chandrababu Naidu
Chandrababu Naidu

పక్కా ప్లాన్‌తో పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు చేశారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలో ఆాయన మీడియాతో మాట్లాడారు. తనను ఒక పెద్దకొడుకుగా నమ్మిన తల్లిదండ్రులు.. కుటుంబ పెద్దగా నమ్మి ఆంధ్రా ప్రజలు ఓట్లేశారన్నారు. పోలింగ్ డేను ఆయన ఒక చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు.

ఇవి మామూలు ఎన్నికలు కాదని వ్యాఖ్యానించిన చంద్రబాబు, దేశాన్ని భ్రష్టుపట్టించిన నియంత మోదీ, రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కేసీఆర్, నేర చరిత్ర ఉన్న జగన్ కలిసి టార్గెట్‌ చేసిన ఎన్నికలుగా చెప్పుకొచ్చారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. ఇటు పోలింగ్ ముగిసిన అనంతరం ఈసీ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభంలోనే 35 శాతం ఈవీఎంలు పనిచేయలేదన్నారు. ఈవీఎంలను రిపేర్‌ చేస్తామని చెప్పి ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు ఆయన. ప్రజల భవిష్యత్‌ని ఒక మిషన్‌ మీద వదిలిపెట్టారని ధ్వజమెత్తారు చంద్రబాబు .