మరో సారి సుకుమార్ సినిమాలో అనసూయకి ఆఫర్…!

Anasuya Bharadwaj

బుల్లి తెరలో జబర్దస్త్ షో తో పాపులర్ అయిన అనసూయ బరద్వాజ్ సినిమాలో లుడ నటన పరంగా మంచి సక్సెస్ అందుకుంటుంది. ‘క్షణం’ సినిమాలో నెగటివ్ రోల్ చేసి మంచి పేరు తెచ్చుకున్న అనసూయ,గత ఏడాది ‘రంగస్థలం’ సినిమాతో ఒక ఊపు ఊపేసింది.రంగమ్మ అత్తగా తన నటన తో అందరిని ఫిదా చేసిన అను ఇప్పుడు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఓకే చేస్తుంది.

అయితే అనసూయకు రీసెంట్ గా మరో మూవీలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మహేష్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో రంగమ్మత్తకు ఛాన్స్ వచ్చింది అని సమాచారం. ఈసినిమాలో అనసూయ పాత్ర తన నటనలో మరో స్థాయిలో చూపించే పాత్ర అవుతుందని సమాచారం.