ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అమిత్ షా బ‌హిరంగ లేఖ

Amit-Shah
Amit-Shah

భవిష్యత్‌పై ఏపి సిఎం చంద్రబాబు కంటున్న కల లు త్వరలో కల్లలవుతాయన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా. ఆయన ఆంద్ర‌ప్ర‌ధేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు . ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ వస్తే కనీసం గౌరవించాలన్న విజ్ఞతలేని వ్యక్తి చంద్రబాబు అని ఆయ‌న విమ‌ర్శించారు. ఏపి సిఎం రాజకీయ భవిష్యత్‌ దెబ్బతిన్నదని, తన మనుగడను కాపాడుకునేందుకే నాటకాలాడుతున్నారన్నారు అమిత్ షా.

ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడులు చేసేంత వరకు వ చ్చారని.. చివరకు ఆయన భార్య పేరును కూడా తీసుకున్నారని పరోక్షంగా ఆక్షేపించారు. చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపినందుకు ఆయనకు పరాజయం తప్పదన్నారు. ఏపి సిఎం చంద్రబాబు దీక్షా ప్రాంగణంలో టీడీపీ పెట్టిన ఓ ప్లకార్డులో ఉన్న రాతలను బీజేపీ తప్పుబట్టింది. ప్రత్యేకహోదా కోరినవారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.