గాంధీన‌గ‌ర్ నుంచి అమిత్ షా నామినేష‌న్

Amit-Shah
Amit-Shah

ఎల్ కే అద్వానీ, వాజ్‌పేయీ లాంటి గొప్ప నేతలు ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌ నుంచి పోటీ చేయడం త‌న‌కు గర్వంగా ఉందన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు . గాంధీనగర్‌లోని రిటర్నింగ్‌ అధికారికి ఆయ‌న త‌న నామినేష‌న్ ప‌త్రాలను సమర్పించారు.

వచ్చే ఎన్నికల్లో బిజేపి గెలుపు ఖాయ‌మ‌న్న అమిత్ షా, మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశం అంతా కోరుకుంటోందన్నారు. దీనికి ముందు విజయ్‌ సంకల్ప్ సభ పేరుతో అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌, రామ్‌ విలాస్ పాసవన్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.