గాంధీన‌గ‌ర్ నుంచి అమిత్ షా అద్భుత విజ‌యం

Amit-Shah-Gandhi_d
Amit-Shah-Gandhi_d

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీచేసిన ఆయన బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పేరిట ఉన్న అత్యధిక మెజారిటీ రికార్డును తిరగరాస్తూ కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై రికార్డు విక్టరీ నమోదు చేశారు. అద్వానీ గతంలో 4.83 లక్షల మార్జిన్ తో గెలుపొందగా.. అమిత్ షా 5.11 లక్షల మార్జిన్ తో సరికొత్త రికార్డు సృష్టించారు. తాజా విజయంతో అమిత్ షా కూడా లోక్ సభలో అడుగుపెట్టనున్నారు.