యుపి ఫ‌లితాల‌పై అమిత్ షా జోస్యం..!

Amit-Shah
Amit-Shah

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ 74 సీట్లు గెలవడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జొస్యం చెప్పారు. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ 72 సీట్లకు పైగా గెలుస్తుందనా ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలని ఈ దేశ ప్రజలు డిసైడ్ అయ్యార‌న్నారు. బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్య‌క్తం చేశారు అమిత్ షా. ఈ దేశ భద్రత కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో దేశంలో నక్సలిజం అధికంగా ఉండేదన్నారు . ఎప్పుడైతే రాజ్‌నాథ్‌ సింగ్‌ హోంశాఖ మంత్రి అయ్యారో.. అప్పట్నుంచి నక్సలిజాన్ని అంతమొందించామని స్పష్టం చేశారు అమిత్ షా .