నిజామాబాద్ లో జోస్యం చెప్పిన అమిత్షా

Amit-Shah
Amit-Shah

తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారన్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా. నిజామాబాద్లో జరిగిన బిజెపి బహిరంగ సభలో అమిత్షా ప్రసంగించారు. ఐదేళ్లలో మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. మోడీ మరొకసారి ప్రధాని కావడం తథ్యమని జోస్యం చెప్పారు అమిత్షా . వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే బీజేపీ లక్ష్యమని, ఏడాదికి రూ.6 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు.

ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి ఒక అజెండా లేదని విమర్శించారు . ఆ పార్టీ ఈ దేశానికి చేసిందేమీ లేదని, దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు అమిత్షా . తాము ఐదేళ్లలో దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచామని, దేశాన్ని రక్షించే సత్తా ఉన్న నాయకుడు మోదీ అని ప్రశంసించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతిఒక్కరూ శ్రమించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు ఆయన. దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇచ్చామని, పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు అమిత్ షా.