యాత్ర ప్రొడ్యూసర్స్ కి జాక్ పాట్

Yatra
Yatra

YSR జీవితంలోని కీలకఘట్టమయిన పాదయత్రని ఇతివృత్తంగా తీసుకుని నిజాయితీగా చేసిన ప్రయత్నానికి తెరరూపం యాత్ర సినిమా.మొదటి రోజు నుండే సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న యాత్ర సినిమా బాక్స్ ఆఫీస్ స్టామినా ని నిరూపించే సోమవారం నాడు కూడా మంచి ఆక్యుపెన్సీ రేటుతో పెట్టిన పెట్టుబడి వెనక్కు తేవడం ఖాయం అయిపోయింది.అయితే ఆ సినిమాకి అనుకోని విధంగా లాభాలు అందుకుతున్నాయి.

OTT ఫ్లాట్ ఫార్మ్స్ లో తన అధిపత్యం కొనసాగిస్తున్న అమెజాన్ ఈ సినిమాని ఏకంగా 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అంటే సినిమాకి పెట్టిన పెట్టుబడిలో ఆల్మోస్ట్ 70 సతమ వెనక్కి వచ్చేసినట్టే.ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని కదిలించింది.దాంతో మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని సినిమాకి వెళ్లలేని వాళ్ళు కూడా హిట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా చూస్తారు.

ఇలా అన్ని అంశాలలో దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఆల్మోస్ట్ పెద్ద హీరోల సినిమాల రేంజ్ లో రేటు పెట్టి కొన్నారు.ఇక ఈ సినిమా సాటిలైట్ అండ్ హిందీ డబ్బింగ్ హక్కుల కొనుగోలు విషయంలో కూడా భారీ పోటీ నెలకొంది.ఎలా చూసుకున్నా కూడా నిర్మాతలకు భారీ లాభాలే అందుతున్నాయి.ఒక సినిమా ప్రజల హృదయాలకు హత్తుకునేలా తీస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని యాత్ర ప్రూవ్ చేసింది.