పట్టాలెక్కుతున్న అమరావతి “సీడ్ క్యాపిటల్”..!

amaravathi chandrababu education parks seedcapital
amaravathi chandrababu education parks seedcapital

ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని లో సీడ్ క్యాపిటల్ గా పిలుస్తున్న స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయి. ఆంధ్ర_అమరావతి అబివృద్ధి కి చోదకశక్తిలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యం తో ఏపీసీఆర్డీయే స్టార్టప్‌ ఏరియాను ప్రతిపాదించినారు. రాజధాని లోని అత్యంత కీలక ప్రదేశం అయిన కృష్ణానదీ తీరాన, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు- గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ల కు కోసం 1691 ఎకరాలను కేటాయించారు. ఈ ప్రదేశము ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం ద్వారా జాతీయ,అంతర్జాతీయ వాణిజ్య,ఆర్థిక సంస్థలను ఇక్కడికి రప్పించి ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా చేయాలన్నది వీరి లక్ష్యం. దీని ద్వారా రాజధాని ఆదాయం పెరగడమే కాకుండా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని అన్నారు . భూముల ను కూడా ఆకర్షణీయమైన రీతిలో అభివృద్ధి పరచి, మంచి ధరలకు విక్రయించే బాధ్యత కూడా స్టార్టప్‌ ఏరియా డెవలపర్‌దే అని అన్నారు . దీని ద్వారా లభించే ఆదాయంలో 42 శాతాన్ని సింగపూర్‌ కన్సార్షియం సీఆర్‌డీఏకు ఇస్తుంది. స్టార్టప్‌ ఏరియా రాకతో అమరావతి వ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి.

సీడ్ క్యాపిటల్‌ పనుల్లో భాగంగా 50 ఎకరాల విస్తిర్ణంలో మొదటి దశ పనులు ప్రాంరంభింనున్నారు దీనిలో.. కన్వెన్షన్ సెంటర్, పార్కులు తదితర నిర్మాణాలు ఉంటాయన్నారు. రాజధాని లో ఇప్పటికే ప్రభుత్వ భవనాలు పనులు శరవేగం గా నడుస్తున్నాయి ఈ విషయం తెసిందే. సీడ్ క్యాపిటల్ పనులు ప్రారంభం కానుండటం తో.. మరింత వేగంగా.. అభివృద్ధి పనులు తో అమరావతికి ఆకృతి వచ్చే అవకాశం కనిపిస్తోంది.