సూపర్ ఛాన్స్ మిస్ అయిన అల్లువారబ్బాయి

Allu-Sirish

అల్లు శిరీష్…హీరో గా కెరీర్ స్టార్ట్ చేసి చాలాకాలం అయ్యింది.కానీ శ్రీరస్తు-శుభమస్తు అనే ఒకే ఒక్క హిట్ మాత్రమే అతని ఖాతాలో ఉంది.అయితే మలయాళంలో మోహన్ లాల్ తో ఒక సినిమా చేసాడు.దాంతో అనుకోకుండా తమిళ్ లో ఒక మంచి ఆఫర్ వచ్చింది.KV ఆనంద్ అండ్ సూర్య ల సెన్సషనల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శిరీష్ కి ఒక సపోర్టింగ్ ఆ రోల్ ఆఫర్ చేసారు.ఆ సినిమాలో మోహన్ లాల్ కూడా ఒక పెద్ద రోల్ లో కనిపిస్తున్నాడు.

ఆ సినిమాలో శిరీష్ స్కోప్ ఉన్న రోల్ ఆఫర్ చేసారు.కానీ ఆ టైం లో హీరో గా సినిమా స్టార్ట్ చేద్దాం అన్న థాట్ తో ఆ సినిమా వదులుకున్నాడు.దాంతో ఆ రోల్ కి తమిళ్ హీరో ఆర్య ని తీసుకున్నారు.ఇప్పడు ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.కప్పాన్ అనే పేరుతో తెరకెక్కిన ఆ సినిమా ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.కానీ శిరీష్ హీరోగా చేస్తున్న ABCD సినిమా ఫస్ట్ లుక్ కి మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.దాంతో శిరీష్ అనవసరంగా సూపర్ ఛాన్స్ మిస్ అయ్యాడు అంటున్నారు.

ఇంతకుముందు సూర్య-ఆనంద్ ల కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి.అయితే ఈ సినిమాపై మాత్రం భారీ అంచనాలున్నాయి.శిరీష్ ఈ సినిమాలో నటించి ఉంటే హిట్ రావడమే కాదు,తమిళ్ లో కూడా మార్కెట్ డెవలప్ అయ్యేది.అనవసరంగా ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు.ABCD అయినా హిట్ అయితే ఈ పొరపాటు కాంపెన్సేట్ అయిపోతుంది.లేకపోతే మాత్రం శిరీష్ చేసిన తప్పుకు రిగ్రెట్ అవ్వాల్సిందే.