రెగ్యులర్ షూటింగ్ షురూ చేసిన బన్నీ…!

Stylish Star Allu Arjun
Stylish Star Allu Arjun

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 19 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా.కాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ బుధవారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ కోసం తీసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందిగీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. టబు, సత్యరాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సునీల్‌, నవదీప్‌, బ్రహ్మాజీ, రావు రమేష్‌, మురళీశర్మ, రాహుల్‌ రామకృష్ణ ఈ సినిమాలో ఇతర పాత్రలలో నటిస్తున్నారు.