కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు

lok sabha elections Phase 4
lok sabha elections Phase 4

భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. 17వ లోక్‌సభలో 25 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరికి ఇవాళ శాఖలు కేటాయించారు.

కేంద్ర మంత్రులు

నరేంద్ర మోదీ – ప్రధానమంత్రి, అణు శక్తి, అంతరిక్షంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర అన్ని శాఖలు

రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ శాఖ
అమిత్ షా – హోం శాఖ
నితిన్ గడ్కరీ – రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
సదానంద గౌడ – ఎరువులు, రసాయనాలు
నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ
రామ్ విలాస్ పాశ్వాన్ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
రవిశంకర్ ప్రసాద్ – న్యాయశాఖ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ – ఫుడ్ ప్రాసెసింగ్
థావర్‌చంద్ గహ్లోత్ – సామాజిక న్యాయశాఖ
సుబ్రమణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాలు
రమేశ్ ఫోఖ్రియాల్ – మాననవనరుల శాఖ
అర్జున్ ముండా – గిరిజన వ్యవహారాలు
స్మృతి ఇరానీ – మహిళా శిశు సంక్షేమం, జౌళి
హర్షవర్ధన్ – ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ
ప్రకాశ్ జవదేకర్ – అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఐ అండ్ బీ
పీయూష్ గోయల్ – పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వేలు
ధర్మేంద్ర ప్రదాన్ – పెట్రోలియం, ఉక్కు
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులు
మహేంద్రనాథ్ పాండే – నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రైన్యూర్ షిప్
అరవింద్ సావంత్ – భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
గిరిరాజ్ సింగ్ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్
గజేంద్ర సింగ్ షెకావత్ – జలవనరులు(జల్ శక్తి)

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

సంతోష్ కుమార్ గాంగ్వర్ – శ్రామిక, ఉపాధి కల్పన శాఖ

ఇంద్రజిత్ సింగ్ – ప్రణాళిక, గణాంక శాఖ
శ్రీపాద యశో నాయక్ – ఆయుష్, డిఫెన్స్ శాఖ సహాయమంత్రి
జితేంద్ర సింగ్ – సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, ఈశాన్య రాష్ర్టాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి
కిరణ్ రిజిజు – క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు
ప్రహ్లాద్ సింగ్ పటేల్ – సాంస్కృతిక పర్యాటక శాఖ
రాజ్ కుమార్ సింగ్ – విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
హర్దీప్ సింగ్ పూరి – గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
మన్ సుఖ్ మాండవ్య – షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు

సహాయ మంత్రులు

ఫగన్ సింగ్ కులస్తే – ఉక్కు శాఖ సహాయ మంత్రి
అశ్వినీ కుమార్ చౌబే – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి
అర్జున్ రామ్ మేఘవాల్ – పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయమంత్రి
జనరల్ వీకే సింగ్ – రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రి
కిషన్ పాల్ – సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి
రావు సాహెబ్ దాన్వే – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ సహాయ మంత్రి
కిషన్ రెడ్డి – హోంశాక సహాయ మంత్రి
పురుషోత్తమ్ రూపాలా – వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి
రాందాస్ అథవాలే – సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి
సాధ్వి నిరంజన్ జ్యోతి – గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
బాబులు సుప్రియో – అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి
సంజీవ్ కుమార్ బల్యాన్ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్ సహాయ మంత్రి
ధోత్రే సంజయ్ శ్యామ్ రావు – మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
అనురాగ్ సింగ్ ఠాకూర్ – ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
సురేశ్ చిన బసప్ప – రైల్వే శాఖ సహాయ మంత్రి
నిత్యానంద్ రాయ్ – హోంశాఖ సహాయ మంత్రి
రతన్ లాల్ కఠారియా – జలవనరులు, సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి
వి. మురళీధరన్ – విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
రేణుకా సింగ్ సరూత – గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
సోమ్ ప్రకాశ్ – పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి
రామేశ్వర్ తేలి – ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ర్టీ శాఖ సహాయ మంత్రి
ప్రతాప్ చంద్ర సారంగి – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫిషరీస్ శాఖ సహాయ మంత్రి
కైలాస్ చౌదరి – వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి
దేబోశ్రీ చౌదరి – మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి