త‌మిళ‌నాట ఉద‌యించిన ప్ర‌ధాన పార్టీల పొత్తులు

Alliances of major parties emerged in Tamil Nadu
Alliances of major parties emerged in Tamil Nadu

ప్ర‌స్తుత వాతావ‌ర‌ణంతో పాటు ఎన్నిక‌ల వేడి కూడా త‌మిళ‌నాట రాజు కొంటోంది. ఇక్క‌డా పొత్తుల ఎత్తులు దాదాపుగా ఖ‌రార‌య్యాయి. ప్రధాన పార్టీలు రెండు కూటముల బాట పట్టాయి. తాజాగా డీఎంకే హస్తం పార్టీతో లోక్ సభ ఎన్నికల కోసం జ‌త‌క‌ట్టింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాలలో 9 సీట్లు, పుదుచ్చేరి సీటుతో కలిపి10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ డిఎంకే తో పొత్తు ఖ‌రారు చేసుకుంది. 20కి పైగా సీట్లలో డీఎంకే, వీసీకే, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, ఎంఎంకేలకు మిగతా సీట్లతో పొత్తులు షురూ అయ్యాయి. ఏఐసీసీ స్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముకుల్ వాస్నిక్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈ మేర‌కు జ‌రిపిన చర్చలు ఫ‌లించాయి. అటు హ‌స్తిన‌లో ఎంపి కనిమొళి, డీఎంకే సీనియర్ నేతలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపి స్టాలిన్, ముకుల్ వాస్నిక్ ల‌తో క‌ల‌సి చెన్నైలో పొత్తును ప్ర‌క‌టించారు. ఇక ఇప్ప‌టికే 2019 ఎన్నికలకు అధికార అన్నాడీఎంకే-బీజేపీతో లోక్‌సభ ఎన్నికల పొత్తు ప్రకటించింది. 5 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంటే మిగతా స్థానాలలో అన్నాడీఎంకే, పీఎంకె పోటీ చేస్తున్నాయి. త‌మిళ‌నాట దాదాపుగా పొత్తులు ఖ‌రారు కావ‌డంతో అన్ని ప్ర‌ధాన పార్టీలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభ్య‌ర్ధుల వేట‌లో ప‌డ్డాయి.