రవితేజ సినిమాలో అల్లరి నరేష్…!

Allari Naresh
Allari Naresh

కామెడీ సినిమాల తో మన ముందుకు వచ్చి దాదాపు హీరోగా యాభైకి పైగా సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఒక వైపు సోలో గా సినిమాలు చేస్తూనే మరో వైపు పెద్ద సినిమాల్లో మంచి పాత్రలని కూడా చేస్తూ వెళ్తున్నాడు. ఇటీవలే మహర్షి లో ఒక కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించిన నరేష్ ఇప్పుడు మరొక పెద్ద సినిమా లో నటించనున్నాడు అని టాక్.త్వరలో వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజా అనే చిత్రం లో నరేష్ ఒక కీలక పాత్ర పోషించనున్నాడని టాక్. మహర్షి లో నరేష్ పాత్ర నచ్చి మేకర్స్ నరేష్ ని ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో ముందుగా ఈ పాత్ర ని సునీల్ తో చేయించాలి అనుకున్న దర్శక నిర్మాతలు ఇప్పుడు నరేష్ ని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది.అయితే ఇదే విషయం పై ఒక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.