అల్లరి వేషాలకి నరేష్ గుడ్ బై

Allari Naresh
Allari Naresh

అల్లరి నరేష్..మొదటి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ఇప్పటివరకు బండి లాగించేసిన నరేష్ మహర్షి సినిమా నుండి సినిమాల ఎంపికలో కూడా కొత్త టర్న్ తీసుకుంటున్నాడు.అల్లరికి ఫుల్ స్టాప్ పెట్టేసి వెరైటీ జోనర్స్ ని వెదుక్కుంటున్నాడు.

ఇప్పడు అల్లరి నరేష్ ఓకే చేసిన సినిమా గురించి వింటే అవ్వాక్కవ్వాల్సిందే.మహర్షి సినిమాలో గమ్యం లో గాలిసీనులా కామెడీ క్యారెక్టర్ కాదు.ఎమోషనల్ టచ్ ఉండే పాత్ర.పైగా సినిమాకి కీలకం కూడా.అయితే ఆ పాత్ర పోషిస్తుండగానే వచ్చిన ఫీడ్ బ్యాక్ ని బట్టి నరేష్ నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా డిఫరెంట్ గా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాడు.

అందుకే తన నెక్స్ట్ సినిమాని క్రైమ్ థ్రిల్లర్ జోనర్ చెయ్యబోతున్నాడు.గతంలో నరేష్ కి యముడికి మొగుడు,బెట్టింగ్ బంగార్రాజు లాంటి హిట్స్ ఇచ్చిన E.సత్తిబాబు డైరెక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు.ఇన్నాళ్లు కామెడి కథలతో కాలక్షేపం చేసిన నరేష్ ఇకపై రకరకాల కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యబోతున్నాడు.