ఆలియా అదరగొట్టిందిగా

Kalank
Kalank

టీజర్ తోనే ఒక వేవ్ క్రియేట్ చేసుకున్న సినిమా కళంక్.అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు చూపించిన గ్రాండియర్ మాత్రమే కాదు మంచి అనుభూతని ఇచ్చే ఎమోషన్ కూడా ఉంది అని టీమ్ చెబుతుంది.అయితే ఆ ఎమోషన్ కరెక్ట్ గా రీచ్ అయ్యేలా కథ చెప్పాలి అంటే యాంబియన్స్ కూడా అవసరం కాబట్టి 100 ఖర్చుపెట్టారు.

ఈ సినిమా నుండి బయటికి వచ్చిన ఘర్ మరి పరదేశి సాంగ్ చూస్తే ఇదే విషయం అర్ధమవుతుంది.అలియా భట్ ఏంత్తో కష్టపడి ఈ సాంగ్ లో నటించా అని చెప్పిన మాటలు కరెక్ట్ అని సాంగ్ చూస్తే అర్ధమవుతుంది.నటీనటులు ఒక హైలైట్ అనుకుంటే శ్రీయ ఘోషల్ పాడిన విధానం,రెమో డి సౌజా ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసిన తీరు అద్భుతం అనే చెప్పాలి.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ మనసు పెట్టి మరీ కంపోజ్ చేసినట్టు ఉంది సాంగ్.అయితే ఈ సాంగ్ మొత్తానికి ఆలియా భట్ హెలైట్.ఆమె ఎక్స్ప్రెషన్స్ గాని,కథక్ డాన్స్ గాని,ఆమె స్టైలింగ్ గాని అన్నే స్టన్నింగ్ గా ఉన్నాయి.ఈ ఒక్క సాంగ్ తో వంద కోట్ల ప్రాజెక్ట్ కి సైతం సూపర్ హైప్ వచ్చింది.