ఫణి తుఫాన్ బాధితులకు అక్షయ్‌ కోటి రూపాయల సాయం…!

Akshay Kumar
Akshay Kumar

ఫోని తుఫాను ప్రభావంతో ఒడిశా తీవ్రంగా నష్టపోయింది. తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ భారీ విరాళం అందించారు. దాదాపు కోటి రూపాయలను ఆయన ఒడిశా సియం నవీన్‌పట్నాయక్‌ సహాయనిధికి పంపించారు. గతంలో కేరళ, చెన్నైలో తుఫాను బీభత్సం సృష్టించినపుడు కూడా అక్షయ్‌ తనవంతు సాయం చేశారు. అంతేకాదు భారత్‌ కే వీర్‌ వెబ్‌సైట్‌ ద్వారా జవాను కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారు.