బన్నీ-త్రివిక్రమ్‌ సినిమాలో అక్కినేని హీరో…!

Susanth
Susanth

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్‌ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.’అల్లు అర్జున్‌ 19వ సినిమా సెట్స్‌లో ఇది నాకు తొలిరోజు. సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను కానీ నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్‌తో, ‘ఆర్య’ సినిమా నుంచి నేనెంతో ఆరాధిస్తున్న బన్నీతో, టబు, నా స్నేహితురాలు పూజా హెగ్డే, పీఎస్‌ వినోద్‌, తమన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. నాకు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ‘చిలసౌ’ తర్వాత ఈ సినిమా నాకు మరో సాహసం లాంటిది. ఈ అద్భుతమైన చిత్రబృందం నుంచి నేనెంతో నేర్చుకోగలనన్న నమ్మకం ఉంది’ ట్వీట్లో పేర్కొన్నారు.