అఖిల్ గట్టెక్కినట్టేనా?

Mr Majnu
Mr Majnu

అఖిల్ అక్కినేని…మొదటి సినిమాకి ముందు టాలీవుడ్ లో ఈజీగా హీరోగా సెటిల్ అయిపోతాడు అని అంతా లెక్కలు వేశారు.అక్కినేని అభిమానులు అయితే ఫ్యూచర్ మహేష్ బాబు అని మోసేశారు.ఓవర్ బడ్జెట్ తో తెరకెక్కిన అఖిల్ ఫస్ట్ సినిమా అఖిల్ డామ్ అనడంతో అఖిల్ ఆశలకు గండిపడింది.కాస్త కోలుకుని సొంత బ్యానర్ లో చేసిన హలో సినిమా కూడా ప్రేక్షకులను పోలో మంతో థియేటర్స్ లకి రప్పించలేకపోయింది.దాంతో తొందరదకుండా ఎప్పుడో విన్న మిస్టర్ మజ్ను కథను ఇప్పడు బయటికి తీసాడు.రొమాంటిక్ దారిలో వెళ్లి హిట్ అందుకోవాలని చూసాడు.అయితే మిస్టర్ మజ్ను కూడా పూర్తిగా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాడు.

అయితే గత రెండు సినిమాలతో పోలిస్తే పర్లేదు అనిపించుకుంది.అన్ని ఏరియాల్లో కూడా యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయికాకపోతే ఈ సినిమాని లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించడం ప్లస్ అయ్యింది.మూడు రోజులకు కలిపి ఎనిమిది కోట్లమేర రికవర్ చేసిన ఈ సినిమా సేఫ్ అయ్యే అవకాశాలని కొట్టిపారెయ్యడానికి లేదు.కానీ వింటర్ వర్షాల్లో థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలా ? అన్న టాక్ క్రియేట్ అవుతుందిటెక్నీకల్ గా చెప్పాలంటే వాతావరణం ప్రభావం అఖిల్ సినిమాపై పడింది.కాకపోతే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రిలీజ్ కావట్లేదు.సో,యాత్ర వచ్చేవరకు మజ్ను కి ఢోకా లేదు.మరి ఈ అవకాశాన్ని మజ్ను ఎంతవరకు వాడుకుంటాడో?,ఎన్ని కోట్లు రాబడతాడో చూడాలి.