ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్‌తో అఖిల్ న్యూ సినిమా!

Akhil, Mr Majnu, Nagarjuna, 4thfilm,

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను రీసెంట్ గా రిలీజై మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ నాలుగో సినిమాకి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అక్కినేని యువ హీరో అఖిల్ మూడవ ప్రయత్నంలో కూడా అంతగా సక్సెస్ కాలేదు. మొదటి సినిమా అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్, 2 వ సినిమా హలో తో పర్వాలేదనిపించాడు. ఇక ముచ్చటగా మూడోచిత్రం మిస్టర్ మజ్ను అయినా విజయం సాదిస్తాదంటే ఇది కూడా యావరేజ్ మిగిలిపోయింది. అఖిల్ నెక్స్ట్ మూవీ ని నిలబెట్టడానికి ఎవరు రావాలి .. ఇక ఇప్పుడు అఖిల్ నాల్గవ చిత్రం ఇండస్ట్రీ లో హాట్ హాట్ టాపిక్ .

వరస పరాజయాలతో ఉన్న డైరెక్టర్ శ్రీను వైట్ల, అఖిల్ కోసం స్టోరీ ని సిద్ధం చేసా డంట. అంతేకాదు ఇటీవల వైట్ల, అఖిల్ తో సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. దాంతో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉందట. కానీ ఈ ప్రాజెక్ట్ కి ఇంకా నాగార్జున నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ఈ విషయం పై త్వరలో క్లారిటీ రావచ్చు.