మజ్ను…ఆకట్టుకుంటున్నాడు

Mr Majnu
Mr Majnu

అఖిల్ అక్కినేని,నిధి అగర్వాల్ జంటగా తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటెర్టైనెర్ మిస్టర్ మజ్ను.ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమా జోనర్ పై,కంటెంట్ పై అందరికి క్లారిటీ వచ్చింది.కానీ ఈ సినిమా మాత్రo కాస్త అతిగా ఉంది,ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు అనిపించుకుంది.

అయితే ఈ సినిమా ఆడియో మాత్రం సినిమాపై అంచనాలు పెంచింది.థమన్ డెలివర్ చేసిన సోల్ ఫుక్ మెలోడియస్ ఆల్బమ్ సినిమా పై చాలా పోజిటివిటీ డెవలప్ చేసాయి.ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయిన మ్యూజికల్ హిట్స్ అనే కల్చర్ ని మజ్ను మళ్ళీ రిపీట్ చేసేలా కనిపించింది.ఈ సినిమాకి ఆడియో సక్సెస్ ఫుల్ బూస్ట్ ఇచ్చింది.అయితే ఇక ఈ సినిమా నుండి ఇప్పడు రిలీజ్ అయిన కొత్త ప్రోమో సాంగ్ ఈ సినిమా గ్రాండియర్ ని తెలుపుతూ సినిమాపై మరింత బజ్ పెంచింది.

ఈ సినిమాతో అఖిల్ కి తొలి హిట్ వచ్చేలా కనిపిస్తుంది.అలాగే టాలీవుడ్ డైరెక్టర్స్ కి ఆనవాయితీగా మారిన సెకండ్ సినిమ సిండ్రోమ్ ని ఈ సినిమా హిట్ తో వెంకీ అట్లూరి దాటుతాడు అనే కాఫిడెన్స్ తో ఉంది సినిమా యూనిట్.సవ్యసాచితో ప్లాప్ అందుకున్న నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.సో,ఇంతమందికి ఇంపార్టెంట్ గా మారిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది ఈ నెల 25 న తేలిపోతుంది.