హీరోయిన్ కోసం అఖిల్ వెయిటింగ్

Akkineni Akhil
Akkineni Akhil

ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన అఖిల్ కి సినిమాల మధ్య గ్యాప్ మాత్రం తప్పనిసరి అవుతుంది.దానికి కారణం ఏదైనా సినిమాకి సినిమాకి మధ్య మాత్ర చాలా గ్యాప్ వస్తుంది.అఖిల్ నాలుగో సినిమా గీత ఆర్ట్స్ లో అనేది కన్ఫర్మ్ అయ్యింది.అంటే ప్రొడ్యూసర్ ఓకే.ఇక ప్లాప్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ కసిగా ఒక కథ తయారు చేసుకుని అల్లు అరవింద్ అనే కాదు నాగార్జున ని కూడా ఒప్పించుకున్నాడు.అంటే డైరెక్టర్ కూడా ఓకే.

కానీ విచిత్రంగా ఆ ప్రాజెక్ట్ కి హీరోయిన్ సమస్య తలెత్తింది.అఖిల్ పక్కన సెట్ అవుతూ బొమ్మరిల్లు లో హాసిని లా గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్ కావాలి అనేది భాస్కర్ కండిషన్.కానీ ఈ సెర్చ్ అంత తేలిగ్గా తేలడం లేదు.ఎంత లేట్ అయినా అలాంటి హీరోయిన్ దొరికితేనే ఆ సినిమా సెట్స్ మీదకి వెళుతుందట.ఏ హీరో కి లేని హీరోయిన్ సమస్య ఈ సారి అఖిల్ సినిమాకి అడ్డంకిగా మారడం నిజంగా విచిత్రమే.