అఖిల్ నాలుగో సినిమా ఫిక్స్…?

Akkineni Akhil
Akkineni Akhil

మొదటి సినిమా నుండి కూడా హిట్ కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు అఖిల్.ప్రతి సినిమాకి తన వరకు ఎలాంటి లోపం లేకుండా కష్టపడుతున్నాడు.మిస్టర్ మజ్ను సినిమా కి కూడా చాలా హార్డ్ వర్క్ చేసాడు.మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే అతని డైలాగ్స్ డెలివరీ అండ్ యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి అన్న కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి కానీ కోరుకున్న హిట్ మాత్రం దక్కలేదు.ఆ కాంప్లిమెంట్స్ ఇచ్చిన బూస్ట్ తో తన నాలుగో సినిమాకి ఓకే చెప్పాడు అఖిల్.

కానీ ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీను వైట్ల అంటూ వచ్చిన వార్తలతో అంత షాక్ అయ్యారు.ప్రస్తుతం డబల్ డిజాస్టర్ ఎడ్జ్ లో ఉన్న శ్రీనువైట్లతో సినిమా చేస్తే అఖిల్ కెరీర్ కూడా వాష్ అవుట్ అయిపోతుంది అని ఆందోళనపడ్డారు అక్కినేని అభిమానులు.అసలు విషయం ఏంటంటే అఖిల్ నాలుగో సినిమా ఆదిపినిశెట్టి అన్నయ్య అయిన సత్యప్రభాస్ తో ఓకే అయ్యింది.ఇదివరకే ఈ కాంబినేషన్ సెట్ చెయ్యడానికి చాలా చర్చలు జరిగాయి.

కానీ మూడో సినిమాకి ముందే కమిట్మెంట్ ఉండడంతో అది పక్కనపెట్టారు.ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.కానీ ముందు నుండి అనుకుంటున్నట్టు హిందీ లో కాకుండా కేవలం తెలుగులోనే ఈ సినిమాని రూపొందించబోతున్నారు.పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతున్న ఈ సినిమా అఖిల్ కి టైలర్ మేడ్ లా ఉంటుంది అని ఇదివరకే టాక్ వచ్చింది.త్వరలో అఖిల్ నాలుగో సినిమాగా ఇది సెట్స్ మీదకి వెళ్లబోతుంది.