తప్పు చేసిన తలైవా

petta
petta

తమిళ్ హీరో అజిత్ తో పోల్చుకుంటే తెలుగులో రజిని కి క్రేజ్ అండ్ మార్కెట్ ఎక్కువ.అయితే ఈ సంక్రాంతికి రజిని కాంత్ నటించిన పేట,అజిత్ నటించిన విశ్వాసం పోటీపడుతూ రిలీజ్ అయ్యాయి.అయితే ఓవర్సీస్ మార్కెట్ లో తలైవా రెచ్చిపోతే డొమెస్టిక్ సర్కిల్ లో మాత్రం తల తన తడాఖా చూపించాడు.ఏకంగా 200 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.అయితే రజిని సినిమా పేట ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చెయ్యాలనే పట్టుదలకుపోయారు.

అసలే ఇక్కడ మూడు పెద్ద సినిమాలు వచ్చాయి.వాటి మధ్యలో పడి పూర్తిగా నెగెటివ్ ఫలితం తెచ్చుకుంది పేట.కానీ అజిత్ మాత్రం ఆవేశపడలేదు.తమిళ్ లో ఫుల్ రన్ పూర్తయిన తరువాత ఇప్పడు తెలుగులో విశ్వాసాన్ని రిలీజ్ చేస్తున్నారు.మార్చ్ 1 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి పోటీగా పెద్ద సినిమాలు ఏవీ థియేటర్స్ లో లేవు.అజిత్ కి ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఉంది.దీంతో అజిత్ సినిమాని 400 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఒక డబ్బింగ్ సినిమాకు ఇన్ని స్క్రీన్స్ అంటే చాలా పెద్ద రిలీజ్ కిందే లెక్క.పైగా ఈ సినిమాని తెలుగుతో పాటు కన్నడ లో కూడా రిలీజ్ చేస్తున్నారు.ఆవేశపడకుండా ఆలోచించడంతో పేట లా కాకుండా విశ్వాసానికి అన్నీ కలిసొస్తున్నాయి.పేట ప్రొడ్యూసర్స్ కి కనీసం ఇప్పుడయినా కనువిప్పు కలుగుతుందేమో చూడాలి.