RX100 డైరెక్టర్ కి అసలు సిసలు పరీక్ష

Ajay Bhupathi
Ajay Bhupathi

RX100 బోల్డ్ కంటెంట్ తో వచ్చి యూత్ ని విపరీతంగా ఆకట్టుకుని కోట్లలో లాభాలు ఆర్జించిన సినిమా.ఆ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యకారణం ఆ సినిమా హీరోయిన్ పాయల్ ఘాడమైన చుంబనాలు అనేది ఎవరయినా ఒప్పుకుని తీరాలి.కాకపోతే దాన్ని డిజైన్ చేసింది డైరెక్టర్ కాబట్టి అతని కూడా షేర్ దక్కింది.నిజానికి RX100 సూపర్ డూపర్ కంటెంట్ ఉన్న మూవీ కాదు,అలా అని డైరెక్టర్ స్టఫ్ ని పూర్తిగా ఎలివేట్ చేసిన సినిమా కూడా కాదు.

అందుకే ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి వెళ్లి పోయి చాలా రోజులయినా,ఆ సినిమాలో నటీనటులు వేరే సినిమాలతో బిజీ అయిపోయినా RX 100 డైరెక్టర్ మాత్రం ఇంకా ఖాళీగానే ఉన్నాడు.నెక్స్ట్ సినిమాకి మహాసముద్రం అని పేరు పెట్టాడు.సమంత ని ఒప్పించుకున్నా అన్నాడు.అయితే ఆ సినిమా మల్టీ స్టారర్ కావడం దగ్గర అసలు సమస్య వస్తుంది.నిన్నటిదాకా ఆ సినిమాలో నటించడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అన్నాడు.

కారణం తెలియదు గాని సడెన్ గా తప్పుకున్నాడు.ఇక ఆ డైరెక్టర్ చెబుతున్నట్టు రామ్,నితిన్….వీళ్ళు ఎవరూ అందుబాటులో లేరు.పైగా ఫ్లాప్స్ లో ఉన్నారు.ఇప్పడు చేస్తున్న సినిమాలతో సక్సెస్ వస్తే అప్పుడు ఈ కథని ఒప్పుకుంటారా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.

అంటే RX100 సక్సెస్ అయినా కూడా ఇండస్ట్రీ లో హీరోలు అర్జున్ రెడ్డి తరహాలో దాన్ని డైరెక్టర్ క్రెడిబిలిటీ గా పరిగణించట్లేదు.సో,ఆల్రెడీ సమంత ఓకే చెప్పింది కాబట్టి RX100 చూసి పొగిడిన నాగార్జున దగ్గరికి వెళితే ఏమైనా పనవుతుందేమో.