జ‌గ‌న్ అడిగితే ఏపి ప్ర‌చారానికొస్తా అంటోంది ఎవ‌రో..!

Asaduddin-Owaisi

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంలోని దారుసలాంలో ఎంఐఎం 61వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్, వైసీపీ కలిసి తెలుగు రాష్ర్టాల్లో 35 సీట్లు సాధిస్తే చాలన్నారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు. జగన్ అడిగితే ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేస్తానన్నారు ఎంపీ అసదుద్దీన్. ఎయిర్‌ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కమాండర్ అభినందన్ విషయంలో రాజకీయం చేయొద్దన్నారు.