నాని సినిమాలో నటిస్తున్న ఆదాశర్మ…!

Adah-Sharma
Adah-Sharma

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జెర్సీ’. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది .లేటు వయస్సులో క్రికెటర్ గా ఎదగాలనుకునే వ్యక్తిగా నాని ఇందులో కనిపించనున్నాడు. టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా హెవీగా జరిగిందని టాక్. ఇకపోతే ఈ సినిమాలో ఒక హాట్ హాట్ స్పెషల్ సాంగ్ ఉందట. అందులో ఆదాశర్మ మెరుస్తుందని అంటున్నారు. కాగా ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.