యూ ట్యూబ్‌లో సాయి పల్లవి మరో రికార్డు…!

Sai Pallavi
Sai Pallavi

సాయి పల్లవి మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది.ఆ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి సాయి పల్లవి నటించిన చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రంలోని ‘వచ్చిందే’ సాంగ్.. 182 మిలియన్ వ్యూస్‌ సంపాదించి సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన పాటగా రికార్డ్ క్రియేట్ చేయగా.. ధనుష్ ‘కొలవరి’ సాంగ్ 175 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. అయితే సాయిపల్లవి తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది.

ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘మారి 2’.ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘రౌడీ బేబి’ వీడియో సాంగ్.. తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ను రాబట్టింది. తాజాగా ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ సాయి పల్లవి ‘వచ్చిందే’ సాంగ్‌పై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 183 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో  సౌత్ ఇండియాలోనే యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్‌ రాబట్టిన సాంగ్‌గా నిలిచింది.