సైకిలెక్కిన పెళ్లి పుస్త‌కం హీరోయిన్

Divya-Vani

కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌లుకుతూ తెలుగుదేశంలో చేరిక‌లు మొద‌ల‌య్యాయి.ఎన్నిక‌ల ఏడాది కావ‌డంతో రాక‌పోక‌లు షురూ అయ్యాయి.సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రముఖ సినీ నటి దివ్యవాణి టీడీపీలో చేరారు.దివ్యవాణికి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.తెలుగుదేశం కోసం పాటుపడతానని, పార్టీ గెలుపు కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని నటి దివ్యవాణి చెప్పారు. ఇటు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త దేవీప్రసాద్ కూడా టీడీపీలో చేరారు.ఐటీ అధికారిగా చేసి ఆయన పదవీ విరమణ పొందారు.

దేవిప్రసాద్ బాపట్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా కొంతకాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలలో వినిపిస్తుంది.అయన ఇప్పుడు టీడీపీలో చేరడం ఆసక్తిగా మారింది.బాపట్ల నుండి ప్రస్తుతం టీడీపీకి చెందిన మరో మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్రీరామ్ మాల్యాద్రి ఎంపీగా వున్నారు.దేవీప్రసాద్ కూడా అదేస్థానాన్ని ఆశిస్తున్నారు.ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులు కావడంతో వీరిలో టిక్కెట్ ఎవ‌రిని వ‌రిస్తోందో వేచి చూడాల్సిందే.