కెమెడియ‌న్ ఆలీ ఏ గ‌ట్టు కొస్తాడో..?

Comedian Ali with Leader Pawan Kalyan
Comedian Ali with Leader Pawan Kalyan

కెమెడియ‌న్ ఆలీ ఇప్పుడు ఏ గ‌ట్టు కొస్తాడ‌నేది ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 9 న ఇచ్చాపురంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఆలీ వైసిపిలో చేరుతార‌ని ప్ర‌చారం అయింది.

ఈ నేప‌ధ్యంలో ఇవాళ కెమెడియ‌న్ ఆలీ స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలవడం తీవ్ర‌ చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ తో భేటీ అనంతరం అలీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న అలీ, అందుకు సంబంధించి పవన్ సలహాలు అడిగి తీసుకునేందుకే వచ్చారని స‌మాచారం.

అయితే మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్లిపోవ‌డంతో కెమెడియ‌న్ ఆలీ దారెటోన‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి.