భారతీయుడు 2లో విలన్‌గా అభిషేక్‌ బచ్చన్‌..?? |

Bharateeyudu 2, Abhishek Bachchan, Shankar Director, Aparichitudu, Oke Okkadu, Kajal,

మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ ఏంటి అంటే ‘భారతీయుడు 2’ మొదలైంది. రెండు దశాబ్దాల క్రితం సంచలనం, విజయం అందుకున్న మూవీ భారతీయుడు. అవినీతిపై దర్శకుడు శంకర్‌ ఎక్కుపెట్టిన అస్త్రమే ఈ సినిమా.. అయితే, ఇన్నాళ్లకు ఈ సినిమాకి సీక్వెల్‌ చేస్తున్నాడు శంకర్‌. రోబో సీక్వెల్‌తో ఆశించిన మేజిక్‌ చేయలేకపోయిన శంకర్‌ ఇక… భారతీయుడు 2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.. రీసెంట్‌గా ఆయన మార్క్‌ మిస్‌ అయింది. అపరిచితుడు, భారతీయుడు, ఒకే ఒక్కడులో కనిపించిన స్పార్క్‌ నేటి శంకర్‌లో ఇప్పుడు ఎలా అని వస్తోన్న విమర్శ.

దీనికి గాను శంకర్‌ భారతీయుడు 2తో తానేంటో ప్రూవ్‌ చేయాలనుకుంటున్నాడు.. తాజాగా సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ని తేసుకున్నారు. మరో టాక్‌ ప్రకారం ఈ మూవీలో విలన్‌గా జూనియర్‌ బచ్చన్‌ని అనుకుంటున్నారట. రోబో లో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ని విలన్‌గా మార్చి సంచలనం క్రియేట్‌ చేశాడు శంకర్‌.. తాజాగా కూడా అభిషేక్‌ బచ్చన్‌ని కమల్‌ హాసన్‌ కోసం ఖల్‌నాయక్‌గా ప్లాన్‌ చేస్తున్నాడట. మరి, ఈ మూవీ ఏ విదంగా సంచలనాలకు కేరాఫ్‌గా మారుతుందో చూడాలి..