ABCD ట్రైలర్:కూల్ కామెడీ

ABCD Movie
ABCD Movie

అల్లు శిరీష్ తేలిగ్గానే హీరో అయిపోయాడు గాని తొలి సక్సెస్ అందుకోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది.శ్రీరస్తు-శుభమస్తు తరువాత మళ్ళీ ఇంతవరకు సక్సెస్ రాలేదు.అందుకే ఈ సారి ఎలాగయినా హిట్ అందుకోవాలని రీమేక్ ఫార్ములాను నమ్ముకున్నాడు.మలయాళీ సినిమా ‘అమెరికన్ బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశీ’..షార్ట్ కట్ లో ABCD …. ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించాడు.ఈ సినిమా ట్రైలర్ చుస్తే శిరీష్ కి ఇది పర్ఫెక్ట్ ఛాయస్ అనిపిస్తుంది.ఎమోషన్స్ అండ్ యాక్షన్ అంటూ హైరానా పడిపోకుండా ఆద్యంతం ఫన్ తో నడిచిపోయే సినిమాలా ఉంది ABCD.

శిరీష్ కూడా ఆ పాత్రలో చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడు.ఇక శిరీష్ కి తోడుగా పంచెస్ పేల్చి ఎంటర్టైన్ చెయ్యడానికి భరత్ ఎటూ ఉన్నాడు.కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించిన రుక్సార్ ధిల్లాన్ ఈ సినిమాలో శిరీష్ కి జోడీగా నటిస్తుంది.ట్రైలర్ లోని ప్రతి పంచ్ బాగా పేలింది.డైరెక్టర్ టేకింగ్ కూడా ఆకట్టుకుంది.ఈ సినిమా టీమ్ కి కూడా సినిమాపై పూర్తిగా నమ్మకం వచ్చినట్టుంది అందుకే మహర్షి రిలీజ్ అయిన వారానికే ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెడుతుంది.