ABCD మూవీ రివ్యూ

ABCD - AmericanBornConfusedDesi ReView
ABCD - AmericanBornConfusedDesi ReView

నటీనటులు : అల్లు శిరీష్‌, రుక్సార్ థిల్లాన్, నాగ‌బాబు, భరత్ తదితరులు.
దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని
సంగీతం : జుధా సాంధీ
సినిమాటోగ్రఫర్ : రామ్
ఎడిటర్ : నవిన్ నూలి
విడుదల తేదీ : మే 17, 2019
రేటింగ్ : 2.25/5

గీతా ఆర్ట్స్ లాంటి లెజండరీ ప్రొడక్షన్ హౌస్ బ్యాకప్ ఉన్నా.. కాని తన కంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని తపిస్తున్న అల్లు శిరీష్ ఈ సారి హిట్ కోసం బయటి బ్యానర్ నే నమ్ముకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు లాంటి సోలో విజయం తప్పా.. మరో సక్సెస్ లేని అల్లు శిరీష్ ABCD అనే మలయాళ రీమేక్ తో తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అయ్యాడు. టీజర్ ట్రైలర్స్ ఫన్ ఫీల్డ్ గా ఉండడం, సురేశ్ ప్రొడక్షన్, మధురా ఎంటర్టైన్ మెంట్స్, బిగ్ బెన్ మూవీస్ మూడు నిర్మాణ సంస్థల కాంభినేషన్ లో ఈ సినిమా తెరకెక్కడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మరి సంజీవ్ రెడ్డి డైరక్షన్ లో రూపొందించిన ABCD, A TO Z ఏంటర్టైన్ చేసిందా లేక మమ అనిపించే మరో సినిమాగా మిగిలిపోయిందా అనేది ఇఫ్పుడు చూద్దాం.

కథ :అరవింద్ ప్రసాద్ అమెరికాలో… మల్టీ మిలీనియర్ అయిన విద్యా ప్రసాద్ కొడుకు. తండ్రి ఆస్తితో లగ్జరీ జీవితాన్ని అనిభవిస్తూ.. ఎలాంటి బాధ్యతా లేకుండా హ్యాపీగా జీవితాన్ని ఎంజాయి చేస్తూ ఉంటాడు. అయితే అతని ప్రవర్థతన రోజు రోజుకి మరీ కేర్ లెస్ గా తయారు అవ్వడంతో… విద్యా ప్రసాద్ ఒక ప్లాప్ ప్రకారం అరవింద్ ను అతని ఫ్రెండ్ భాషా ను ఇండియాకు పంపుతాడు. డబ్బు విలువు తెలిసి రావడం కోసం అతనికి కొన్ని కండీషన్స్ పెట్టి, లగ్జరీ లైఫ్ ను దూరం చేస్తాడు. దాంతో అరవింద్ భాషాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. తమ లైఫ్ స్టైల్ ను ఎలా మార్చుకున్నారు. డబ్బు విలువ జీవితం విలువు తెలుసుకున్నారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలసిందే..

నటీనటులు: విషయానికి వస్తే. ..జనరల్ గా లైఫ్ ను ఎంజాయి చేస్తూ ఉండే ఈజీగోయింగ్ బాయ్ పాత్రలను గంతలో కూడా పోషించి మెప్పించిన అల్లు శిరీష్ ఈ సినిమాలో కూడా మరోసారి అలాంటి ఎటమ్ట్ చేశాడు. రిచ్ కిడ్ గా తన ఆటిట్యూడ్ ను బాగా ప్రజెంట్ చేశాడు. అలాగే క్లైమాక్స్ లో కూడా ఒక ఫీల్ ను జనరేట్ చేయగలిగాడు. పాటలు ఫైట్స్ లాంటి కమర్షయల్ ఎలిమెంట్స్ కు స్కోప్ లేని సబ్జెక్ట్ కావడంతో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. హీరో ఫ్రెండ్ క్యారక్టర్ లో ఆల్ మోస్ట్ సెకండ్ హీరోగా, ఫుల్లెంత్ క్యారక్టర్ దక్కించుకున్న భరత్ తన కామెడీ టైమింగ్ తో మంచి సపోర్ట్ అందించాడు..హీరోయిన్ రుక్ సర్ దిల్లాన్ కి చాలా లిమిటెడ్ క్యారక్టర్ దక్కింది. నటన పరంగా సోసోగా అనిపించినా.. స్క్రీన్ ప్రజన్స్ మాత్రం బాగుంది. ఇక వెన్నెల కిషోర్ తళుక్క్ న మెరిసి పేల్చిన కామెడీ పంచెస్ బాగున్నాయి. హీరో తండ్రి పాత్రలో కనిపించిన నాగబాబు, ఆ పాత్రకు కావలస్సిన పెద్దరికం హుందాతనం తీసుకొచ్చాడు. సాఫ్ట్ పాత్రలు చేసే సిరివెన్నెల రాజ విలన్ గా సెట్ కాలేదు అనిపించింది. శుభలేక సుధాకర్, కోటా శ్రీనివాస్ రావు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు..

టెక్సీషియన్స్ :ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సంజీవ్ రెడ్డి, ఎంట్రైన్ మెంట్ కి స్కోప్ ఉన్న కథలో తగినంత వినోదం అందించే సీన్స్ రాసుకోలేకపోయాడు. అయినా కూడా ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా థ్రిల్ చేసినా సంజీవ్ రెడ్డి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి పూర్తిగా చేతులేత్తేశాడు. సీరియస్ నెస్ లేని పొలిటికల్ త్రెడ్ ను సిన్సియర్ గా చెప్పాలి అనే ఉద్ధేశ్యం వల్ల కామెడీ పూర్తిగా కనుమరుగు అయిపోయింది. ఆ పొలిటికల్ రైడ్ కూడా.. కథకు దూరంగా ఆర్టిఫిషియల్ పాయింట్ గా వేరుబాటుగా కనిపించింది. దాంతో క్లైమాక్స్ తో సహా.. సెకండ్ హాఫ్ మొత్తం సెన్స్ లెస్ గా.. తయారయ్యింది. డైలాగ్స్ కూడా అంతంత పెద్దగా అనిపించవు. జుదా సాంధీ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. నవీన్ నూలే ఎడిటింగ్ పర్వాలేదు.. ఇక సినిమాటోగ్రాఫర్ రామ్ పనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

ఫైనల్ గా:హిట్ కోసం తపిస్తునం అల్లు శిరీష్ అందుకోడం ఆల్రెడీ యావరేజ్ కంటెంట్ అనిపించుకున్న సినిమాని ఎంచుకున్నా తన వరకు ప్రయత్న లోపం లేకుండా కష్టపడ్డాడు.. కాని కామెడీ అనకున్నంతగా పండకపోవడం,కథలో కనెక్ట్ అయ్యే మ్యాటర్ లేకపోవడం వల్ల ABCD జస్ట్ ఒక మామూలు సినిమాగా మిగిలింది.మినిమమ్ కంటెంట్ కూడా పాస్ మర్క్స్ వేయించుకునే సమ్మర్ సీజన్ లో వచ్చింది కాబట్టి రెవెన్యూ రికవరీ ఎలా ఉంటుందో చూడాలి.

బోటమ్ లైన్:కంటెంట్ తక్కువ…కన్ఫ్యూషన్ ఎక్కువ