తమిళ్ కి పాకిన బూతు వాసన

90 ml movie
90 ml movie

ఈ మధ్య తెలుగులో బోల్డ్ కంటెంట్ పేరు చెప్పి వరుసగా బూతు సినిమాలు దాడి చెయ్యడం అనేది కామన్ అయిపోయింది.రెండు మూడు లిప్ లాక్స్ చేయించి,హీరోయిన్ అందాలనుఁ కాస్త ఘాటుగా చూపించి చివర్లో కాస్త ఎమోషనల్ డైలాగ్స్ చెప్పనుంచి మామ అనిపించేస్తున్నారు.

ఇప్పుడు తమిళ్ లో కూడా అలాంటి ట్రెండ్ కి నాంది పలుకుతూ 90 ml అనే సినిమా తెరకెకెక్కింది.ఈ సినిమాలో ఏకంగా అయిదుగురు అమ్మాయిల తాగుతూ మాట్లాడిన బూతులు,మధ్య మధ్య లో ఘాటు ఘాటు లిప్ లాక్స్ చూపించారు.బిగ్ బాస్ ద్వారా అక్కడ విపరీతమయిన పాపులారిటీ తెచ్చుకున్న ఓవియా కూడా లిప్ లాక్స్ లో రెచ్చిపోయి రచ్చ చెయ్యడంతో ఆ ట్రైలర్ అక్కడ వైరల్ గా మారింది.

ఇండస్ట్రీ లో కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ మొదలయ్యాయి.అయితే సెన్సార్ అయ్యాక ఎంత హాట్ కంటెంట్ బయటికి వస్తుంది అనేది చూడాలి.ఈ సినిమాకి తమిళ్ హీరో శింబు మ్యూజిక్ అందిచడం మరో హైలైట్.ఇంతకుముందు ఒక బూతు పాటను రికార్డ్ చేసి ఆల్మోస్ట్ జైలు బయట వరకు వెళ్లొచ్చిన శింబు మళ్ళీ ఇప్పడు ఈ బూతు సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

శింబు ఉన్నట్టుండి ఈ కొత్త అవతారం ఎందుకు ఎత్తాడు అనేది అర్ధం కానీ విషయం.కానీ దానివల్ల సినిమాకి ఫుల్ బజ్ అయితే ఏర్పడుతుంది.ఈ సినీమా కనుక హిట్ అయితే,కనీసం హిట్ కాకపోయినా డబ్బులు వస్త్తే మాత్రం ఇదే ట్రెండ్ లో మరిన్ని సినిమాలు దండయాత్ర చేస్తాయి అనేది మాత్రం కన్ఫర్మ్.