నేటి నుంచి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ రెండో షెడ్యూల్‌…!

RRR Movie
RRR Movie

ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. నవంబర్‌లో మొదలైన మొదటి షెడ్యూల్‌ ఇటీవల పూర్తైంది. ఈరోజు నుంచి రెండో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత దానయ్య ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ సినిమాలో నటించే హీరోఇన్లు,ఇతర పాత్రల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.