2.0

ఈ భూమి మ‌నుషుల‌కే కాదు… మిగిలిన జంతువులు, ప‌క్షుల‌కు కూడా. కానీ… మ‌నిషి త‌న స్వార్థం కోసం – టెక్నాల‌జీ పేరుతో, మిగిలిన జీవరాశికి చోటు లేకుండా చేస్తున్నాడు. దానిపై ఆగ్ర‌హించిన ఓ ప‌క్షి ప్రేమికుడి క‌థ ఇది. సెల్‌ఫోన్ త‌రంగాల వ‌ల్ల‌, వాటి నుంచి పుట్టే రేడియేష‌న్ వ‌ల్ల ప‌క్షి జాతి నాశ‌నం అయిపోతోంది.

మ‌రి సెల్‌ఫోన్లు లేకుండా చేస్తే.. సెల్‌ఫోన్ ట‌వ‌ర్ల‌న్నీ ధ్వంసం చేస్తే..? ఇలాంటి ఆలోచ‌న‌తో ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్‌) చెన్నైని అత‌లాకుత‌లం చేస్తాడు. మ‌నుషుల చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లు రెక్క‌లొచ్చిన‌ట్టు ఆకాశంలోకి ఎగిరిపోతుంటాయి. అవ‌న్నీ ఓ రూపం సంత‌రించుకుని, కొంత‌మంది వ్య‌క్తుల్ని భ‌య‌పెడుతుంటాయి. ఆ ప‌క్షిరాజు దూకుడుని అడ్డుకోవాలంటే…

చిట్టిని రంగంలోకి దింపాల‌ని వశీక‌ర్ (ర‌జ‌నీకాంత్‌) స‌ల‌హా ఇస్తాడు. ముందు ఒప్పుకోక‌పోయినా… ఆ త‌ర‌వాత ప‌రిస్థితుల ప్ర‌భావంతో చిట్టిని రీ లోడ్ చేయ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తుంది. అలా మ‌ళ్లీ ప్రాణం పోసుకున్న చిట్టి ప‌క్షిరాజు రెక్క‌ల్ని ఎలా విరిచాడు? చెన్నై మ‌హాన‌గ‌రాన్ని ఎలా కాపాడాడు? అనేదే క‌థ‌.