కొనసాగుతున్న 2.0 రికార్డులు వేట…!

2.0 movie

2.0 ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సౌత్ ఇండియన్ సెల్యులాయిడ్ వండర్ కొన్ని కారణాల వల్ల అనుకున్నంతగా కాసుల వర్షం కురిపించలేకపోయింది.దాంతో భారీ లాభాలు గ్యారంటీ అనుకుంటే కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు కూడా వాటిల్లాయి.రజిని..అక్షయ్ ల నమ్మకం,శంకర్ ఇమాజినేషన్,లైకా ప్రొడక్షన్స్ ధైర్యం అన్నీ కలగలుపుతూ రూపొందిన ఈ సినిమా కి ప్రశంసలు మాత్రం బాగా దక్కాయి.అయితే ఈ సినిమాకి ముందు నుండి ఉన్న టాక్ వల్ల రెండు ప్రతిష్టాత్మక రికార్డ్స్ ని కైవసం చేసుకోగలిగింది.

ఈ సినిమా రిలీజ్ టైం లో ఈ సినిమా పేరుతో కొన్ని రికార్డ్స్ నమోదయ్యాయి.సినిమా రిలీజ్ కి ముందే అతితక్కువ టైం లో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా 2.0 చరిత్ర సృష్టించింది.అయితే బుక్ మై షో లో ఈ సినిమా ఒక అరుదయిన మైలురాయి అందుకుంది.ఒక ఆన్ లైన్ పోర్టల్ రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం 2.౦ టికెట్స్ సెకనుకు 16 వరకు అమ్ముడు పోయాయి.అంటే 2.0 రిలీజ్ టైం మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.అలానే ఒక్క చెన్నైలోనే ఈ సినిమా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ సినిమా రన్ కొనసాగుతుంది.తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా డిక్లేర్ అయిన 2.0 మిగతా చోట్ల మాత్రం ఆ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చెయ్యలేకపోయింది.ఈ సినిమా 3D వెర్షన్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ 2D వెర్షన్ క్రియేట్ చెయ్యలేకపోవడం ఈ సినిమా కలెక్షన్స్ ని శాసించింది అని ఒక ఎనాలిసిస్.