118 ట్రైలర్ : ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్

118 Movie
118 Movie

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 118.తెలుగులో అనేక పెద్ద సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన KV గుహన్ డైరెక్టర్ గా మారి నిర్మించిన సినిమా 118.ఈ సినిమా టైటిల్ లోగో నుండేసి చాలా క్యూరియాసిటీ కలిగిస్తూ వచ్చింది.ఇక ఇప్పడు రిలీజ్ అయినా ట్రైలర్ సైతం ఇది బలమైన కంటెంట్ తో వస్తున్న థ్రిల్లర్ సినిమా అని మాత్రమే కన్వే చేసి మరింత ఆసక్తి పెంచింది.కళ్యాణ్ రామ్ తన జీవితంలో మిస్ అయిపోయిన ఒక అమ్మాయి గురించి వెదుకుతూ కనిపిస్తున్నాడు.

ఈ కథకి,కళ్యాణ్ రామ్ జీవితానికి…అలాగే 118 టైటిల్ కి సంబంధం ఏంటి అనేది కొర్ పాయింట్.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటుంది.నివేతా థామస్,షాలిని పాండే ఇద్దరూ కూడా చాలా ట్రెడిషనల్ లుక్స్ లో కనిపిస్తున్నారు.గుహన్ స్వతహాగానే కెమెరామన్ కావడంతో ఈ సినిమా విజువల్స్ ని మరింత ఎలివేటింగ్ గా ఉండేలా చూసుకున్నాడు.ఆర్.ఆర్ ఆ విజువల్స్ లో డెప్త్ ని బాగా పెంచింది.

థ్రిల్లర్ కి కావాల్సిన రెండు సపోర్టింగ్ పిల్లర్స్ కరెక్ట్ గా సెట్ అయ్యాయి కాబట్టి ఈ సినిమా సగం పాస్ అయిపోయినట్టే.సినిమాలో మెయిన్ ప్లాట్ కూడా కాస్త జెన్యూన్ గా ఉంటే ఈ సినిమా పాస్ అయిపోయినట్టే.ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ ని ఈ సినిమా స్టార్ట్ చేస్తుంది.మరి మార్చ్ 1 న రిలీజ్ అయ్యే ఈ సినిమా హిట్ అయ్యి టాలీవుడ్ సమ్మర్ స్లాట్ కి శుభారంభం ఇస్తుంది అనే నమ్మకం అయితే ఈ ట్రైలర్ కలిగించిందనే చెప్పాలి.మిగతా విషయాలన్నీ కూడా సినిమా చూసాకే క్లారిటీ వస్తుంది.

118 ట్రైలర్