హీరోగా మారుతున్న రౌడీ

Vijay Devarakonda
Vijay Devarakonda

విజయ్ దేవరకొండ రెబెల్ యాటిట్యూడ్ వల్ల అతనికి అంతా కలిసి రౌడీ అనే నిక్ నేమ్ ఇచ్చారు.అతను కూడా దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని ఆ పేరుని ఒక బ్రాండ్ నేమ్ గా మార్చాడు.అయితే రాను రాను విజయ్ రేంజ్ పెరుగుతుంది.అందుకే అతను రౌడీ కాదు హీరో అని పిలిపించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.అందుకే మొత్తం సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ చేతే హీరో అని పిలిపించుకునే ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ లో డియర్ కామ్రేడ్ తో సహా మూడు సినిమాలకి కమిట్ అయ్యాడు విజయ్.అయితే ఇప్పుడు అందులో భాగంగా సెకండ్ ప్రాజెక్ట్ ని చాలా గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేసారు.కొత్త డైరెక్టర్ ఆనంద్ అన్నామలై డైరెక్షన్ లో హీరో అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది.తెలుగు తో పాటు తమిళ్,కన్నడ,మలయాళీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే తెలుగు,తమిళ్,మలయాళంలో విజయ్ కి ఫాలోయింగ్ ఉంది.

ఇప్పడు ఈ సినిమాతో కన్నడలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.అయితే నాలుగు భాషల్లో రిలీజే కి వీలుండేలా ఈ సినిమాని కూడా ఇండియా లోని పలు ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతున్నారు.ఈ సినిమాపై ప్రస్తుతానికి ఉన్న క్లారిటీ ని బట్టి ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతుంది అని అర్ధమవుతుంది.కాకపోతే గతంలో కూడా ఇలానే ఒక తమిళ్ డైరెక్టర్ కి కమిట్ అయ్యి నోటా అనే బైలింగువల్ డిజాస్టరస్ మూవీ ని డెలివర్ చేసాడు.

మళ్ళీ ఇప్పుడు ఏకంగా నాలుగు భాషల్లో హీరో అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో అని అతని ఫ్యాన్స్ భయపడుతున్నారు.నాలుగుభాషల్లో ఆడియెన్స్ ని నేటివిటీలకు అతీతంగా శాటిస్ఫయ్ చేసే ఆ ఎలిమెంట్ ఏంటి అనేది ప్రస్ర్తుతానికి సస్పెన్స్.షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తుండడంతో అర్జున్ రెడ్డి ఫ్లేవర్ తో సినిమాకి మంచి క్రేజ్ రావడం మాత్రం ఖాయం.