స‌ర్ కాదు పేరుతో పిల‌వండి అన్న‌ది ఎవ‌రో తెలుసా

Rahul Gandhi
Rahul Gandhi

తనను సర్ అని కాకుండా రాహుల్ అని పిల‌వాలంటూ విద్యార్ధుల‌తో మ‌మేక‌మ‌య్యారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలోని స్టెల్లా మేరిస్ కళాశాలలో విద్యార్థులతో ఆయ‌న మాట్లాడారు. స్టూడెంట్ప్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న ఓపికగా సమాధానం చెప్పారు. ఇదే సమావేశంలో మహిళా బిల్లు గురించి హామీ ఇచ్చారు ఆయ‌న‌.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా బిల్లు ఆమోదిస్తామని చెప్పారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు రాహుల్‌. మహిళలు పురుషుల కంటే చురుకైన వారంటూ రాహుల్ కితాబిచ్చారు. వారి ఆలోచనలు, కార్యనిర్వహణ పురుషుల కన్నా ఉత్తమంగా ఉంటుందని కామెంట్స్ చేశారు రాహుల్‌.

ఈ చిట్‌చాట్ లో రాహుల్ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఎప్పుడూ తెల్లని కుర్తాలో ఉండే రాహుల్. . చెన్నై సభకి మాత్రం ముదురు రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంటులో హాజరయి స్టూడెంట్ప్ అభిమానాన్ని చూర‌గొన్నారు.