‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’లో స్మార్ట్, 3డీ సినిమాలు..!

smartmultiplex 3D Film Digital Webseries Realshows Subscription Shortfilms

‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్స్ .వివరాలు లోకి వెళితే కేవ‌లం గంట నిడివిగ‌ల సినిమానే ‘స్మార్ట్ సినిమా’గా పిలుస్తూ, త్రీడీ సినిమాలను కూడా ఆన్‌లైన్‌లోనే చూపిస్తూ కొత్త,పాత కాన్సెప్టుతో స‌రికొత్త సినీ ఇండ‌స్ట్రీకి తెర‌లేపుతోంది .‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్’లో వారంకు ఓ స్మార్ట్ సినిమాను విడుద‌ల చేస్తూ, వెబ్‌సిరీస్‌లు, గేమ్‌షోలు, రియాల్టీ షోలతో నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్మెంట్ ఇస్తోంది .

డిజిట‌ల్ మూవీ ప్లాట్ ఫామ్‌గా ‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’లో త్రీడీ సినిమాలు కూడా వీక్షించ వచ్చు . త్రీడీ ఆప్ష‌న్ గ‌ల స్మార్ట్ టీవీల్లో స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్ డాట్ కం ఓపెన్ చేసి త్రీడీ సినిమాల కేటగిరికి వెళ్లి న‌చ్చిన మూవీ సెల‌క్ట్ చేయ వచ్చు. ఇక ఈ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌పై సినిమాల‌తో పాటు ఆన్‌లైన్ షాపింగ్ , ఫుడ్ డెలివ‌రీ కూడా అందుబాటులో ఉంటుంది . ఇందులో విడుదలయ్యే సినిమాలను స్మార్ట్ ఫోన్‌, స్మార్ట్ టీవీ, హోమ్ స్క్రీన్ థియేట‌ర్‌, డెస్క్‌టాప్‌ల‌లో చూడవచ్చు. కేవలం 60 నుంచి 90 నిమిషాల నిడివితో తీసిన సినిమాలను ‘స్మార్ట్ సినిమా’లు పిలుచుకుంటూ వాటిని విడుదల చేస్తుంది ఈ వేదిక‌.

లోక‌ల్ కంటెంట్‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తూ.. ఇటు ప్రేక్ష‌కుడిని, అటు స్మాల్ బడ్జెట్ మూవీ మేక‌ర్‌ని smartmultiplex.com ఆక‌ర్షిస్తోంది. ప్రేక్ష‌కుడికి రిజిస్ట్రేష‌న్‌తో పాటు స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న మొట్ట‌మొద‌టి మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘స్మార్ట్ మ‌ల్టీప్లెక్స్‌’.