సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ టాప్…!

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలి రాజకీయాలు లోకి వెళ్ళిన విషయం తెలిసిందే.అయితే సినిమాలు వదిలేసినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.పవన్ రాజకీయాలలో కూడా తనదయిన శైలిలో దూసుకుపోతున్నారు.దీంతో ఆయన సౌత్ లో హీరోస్ లో టాప్ ప్లేస్ లో నిలిచారు.వివరాలోకి వెళితే సెలెబ్రిటీలు తమ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండేందుకు, తమ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకునేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

అందుకోసం ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ వంటి మాధ్యమాలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ కంటే ట్విట్టర్ ద్వారానే ఫ్యాన్స్ కు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు.ఈ ఏడాది నెటిజన్లు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఎవరి ట్విట్టర్ అకౌంట్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు విషయాల గురించిన లిస్ట్ ను ట్విట్టర్ రిలీజ్ చేసింది. సౌత్ హీరోల్లో టాప్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.ఇక రెండో స్థానంలో విజయ్, మూడో స్థానంలో మహేష్, నాలుగో ప్లేస్ లో ఎన్టీఆర్, ఐదో ప్లేస్ లో మహానటి కీర్తి సురేష్ ఉండటం విశేషం.