సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం

Lakshmi-Narayana
Lakshmi-Narayana

ఆయ‌న ఏ గ‌ట్టు కొస్తార‌నే స‌స్పెన్స్ వీడిపోయింది.ఫైన‌ల్ గా ఏగ‌ట్టు వ‌ద్దు అని క్లారిటీ ఇచ్చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. తటస్థంగా ఉంటానని ఆయన చెప్పారు. ప్రజాసేవ-ఎన్జీవో కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని తెలిపారు.

మరోవైపు ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని తన సన్నిహితులతో లక్ష్మీనారాయణ చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ తరపున ఆయన పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఆయనతో టీడీపీ నేతలు కూడా స‌మావేశ‌మై పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయ‌న మాత్రం ఎన్నిక‌లకు దూరంగా ఉండాలని లక్ష్మీనారాయణ డిసైడ్ అయ్యారు.